హైదరాబాద్, మే 2: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీకి గత నెలలో రూ.3,344 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోపాటు పలు ఏజెన్సీల నుంచి ఈ ఆరు ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది. వీటిలో రూ.2,506 కోట్ల విలువైన ఆర్డర్లు బిల్డింగ్స్ డివిజన్ నుంచి రాగా, రూ.538 కోట్ల విలువైన రెండు ఆర్డర్లు ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి రూ.300 కోట్ల విలువైన ఆర్డర్ నీటి విభాగం నుంచి వచ్చాయి.