40 రెట్లు బోనస్.. బీఎండబ్ల్యూ బైక్స్.. రూ.లక్ష క్యాష్ రివార్డ్స్
40 రెట్లు బోనస్.. బీఎండబ్ల్యూ బైక్స్ | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఆన్లైన్ క్రెడిట్ సంస్థ బిజ్2 క్రెడిట్.. తమ సంస్థలో టాలెంటెడ్ ...

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ప్రతి దీపావళి పండుగకు తన వద్ద పని చేసే ఉద్యోగులకు లగ్జరీ కార్లు.. విలాసవంతమైన ఇండ్లు బహుమతులుగా అందించేవారు.. తాజాగా ఆన్లైన్ రుణ పరపతి సంస్థ బిజ్2 క్రెడిట్ ఈ జాబితాలో చేరింది.
ఇలా ప్రతిభకు పట్టం..
ఇప్పుడు ప్రతిభావంతులను కాపాడుకోవడానికి మెరికల్లాంటి ఉద్యోగులకు పలు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కామన్. టాలెంటెడ్ ఉద్యోగులకు లగ్జరీ కార్లు మొదలు రూ.లక్షల్లో బోనస్‌లు ఇస్తున్నాయి. బిజ్2క్రెడిట్ ఇటీవలే తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్స్, రూ. లక్ష వరకు క్యాష్ రివార్డ్స్, ఇతర ఆకర్షణీయ బెనిఫిట్లు ప్రకటించింది. కరోనా కష్టకాలంలో 2021-22లో వారందించిన సేవలకు గుర్తింపుగా వీటిని అందజేస్తున్నట్లు తెలిపింది.
20 శాతం మంది ఉద్యోగులకు ఇలా
సంస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 శాతం మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా 40 రెట్లు ఇన్సెంటివ్‌లు ప్రకటించింది. అంతే కాదు.. సంస్థ కోసం ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా నూతన హెచ్ఆర్ పాలసీలు తీసుకొచ్చింది. క్లయింట్‌కు మెరుగైన సేవల్లో ప్రొఫెషనలిజం, నైతిక విలువలను కాపాడుకున్న ఉద్యోగులను మూడు క్యాటగిరీలుగా విభజించింది. పీపుల్స్ మేనేజర్, హై-ఫైలర్ టీం, ఐదుగురు వ్యక్తిగత ఉత్తమ ఉద్యోగులుగా నిర్ణయించింది. క్యాష్ ప్రైజ్లతోపాటు వారి అభీష్టం మేరకు బైక్‌లు అందుకోనున్నారు.

యాపిల్ ఐవాచ్‌లు.. గోల్డ్ కాయిన్స్..
ముందస్తుగానే ఉద్యోగులందరికీ బిజ్2 క్రెడిట్ దీపావళి గిఫ్ట్‌లు ప్రకటించింది. యాపిల్ ఐవాచ్ బండిల్, సైక్లింగ్ హెల్త్ ప్యాకేజీ, గోల్డ్ కాయిన్స్ వంటి గిఫ్టులు ఆ జాబితాలో ఉన్నాయి. “ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కష్టంగానే గడిచింది. మా ఉద్యోగులు మాకు నిజమైన ఆస్తులు.. మా ఉద్యోగులను మోటివేట్ చేసి.. వారి పనితీరుకు సాధికారత కల్పించేందుకు మీం అందిస్తున్న చిన్నపాటి అభినందన” అని బిజ్ 2 క్రెడిట్ సీఈవో రోహిత్ అరోరా చెప్పారు.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బిజ్2 క్రెడిట్‌కు దేశంలో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 450 మందికి చేరుకోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- biz2credit
- bonus
- cash rewards
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

