Gold | బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి..!
Gold | బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు దాని స్వచ్ఛత, మేకింగ్ చార్జీలు, ధరల్లో తేడాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Gold | మరో మూడు రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తున్నది. మరోవైపు పెండ్లిండ్లు మొదలయ్యాయి. భారతీయుల్లో అత్యధికులు దీపావళి, పెండ్లిండ్ల సమయంలోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారం ఆభరణాల తయారీలో మేకింగ్ చార్జీలు, ధర వంటి అంశాల్లో సరైన అవగాహన లేకుండానే కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ఆభరణాల కొనుగోలుకు అధికంగా మనీ చెల్లించాల్సి వస్తుంటుంది. పండుగ వేళ అయినా.. పెండ్లికయినా బంగారం కొనేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
ధరపై ఇలా నిర్ధారణ
బంగారం కొనడానికి ముందు ముఖ్యంగా ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. నిత్యం మారిపోతూ ఉంటది. నగరానికి, నగరానికి మధ్య ధరలో తేడా ఉంటది. దాని స్వచ్ఛత మీదే బంగారం ఆభరణాల ధర కూడా ఆధార పడి ఉంటుంది కనుక వీటి కొనుగోలు టైంలో బంగారం ధర.. దాని ప్యూరిటీ ఎంతో అనే మరిచిపోవద్దని చెబుతున్నారు.
మేకింగ్ చార్జీలపై ఇలా
హడావుడిగా బంగారం ఆభరణాలు కొనడం సరి కాదు. వేర్వేరు నగల దుకాణాలకు వెళ్లి ధరలు చెక్ చేసుకోవాలి. ఆయా దుకాణాల్లో ప్యూరిటీ, క్వాలిటీ ఎలా ఉంది.. మేకింగ్ చార్జీలు ఎలా వడ్డిస్తున్నదన్న విషయాలు తెలుసుకుని.. తక్కువ ధరకు విక్రయించే దుకాణంలోనే కొనుగోలు చేయాలని అంటున్నారు.
బంగారం మేకింగ్ చార్జీలు ఆరు శాతం నుంచి 20 శాతం వరకూ ఉంటాయి. దీనివల్ల ఆభరణాల కొనుగోలు ధరల్లో తేడా ఉంటుంది. మిషన్ చేసే నగలు, తక్కువ డిజైన్ గల ఆభరణాలకు మేకింగ్ చార్జీలు తక్కువ. పలు నగల షాపుల యాజమాన్యాలు పండుగల వేళ మేకింగ్ చార్జీలపై రాయితీలు, ఇతర డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కనుక మీరు కొనే బంగారం ఆభరణాల మేకింగ్ చార్జీల్లో రాయితీలకు ప్రయత్నించాలి.
ప్యూరిటీపై రాజీ పడొద్దు..
బంగారం కొనే టైంలో దాని ప్యూరిటీ గురించి తెలుసుకోవాలి. 24 క్యారట్ల బంగారం (.999) ప్యూరిటీ కలిగి ఉంటది. కానీ ఆభరణాలు 22 క్యారట్ల స్వచ్ఛత కలిగి ఉంటాయి. పూర్తి స్వచ్ఛత గల బంగారం అంటే 24 క్యారట్ల బంగారం.. కాయిన్లు, బార్ల రూపంలో లభిస్తాయి.
బంగారం ఆభరణాల తయారీలో ఇతర లోహాలు వాడి తయారు చేస్తారు. ఎంత వరకూ ఇతర లోహాలు కలిపారన్న విషయమై సదరు ఆభరణం ప్యూరిటీని బట్టి తెలుస్తుంది. కనుక బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు మోసపోకుండా కేంద్రం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారిహాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ప్యూరిటీ విషయంలో సందేహాలు ఉన్నా బీఐఎస్ కేర్ యాప్ లోకి వెళ్లి మరీ స్వయంగా చెక్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

