Fixed Diposits | ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. 7 శాతం వడ్డీ వరకు ఆఫర్!
Fixed Diposits | ఐదు ప్రైవేట్ బ్యాంకులు.. మూడేండ్ల టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి.

Fixed Diposits | రిటర్న్స్ గ్యారంటీ హామీ కావాలంటే డెట్ ఇన్వెస్ట్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందిన మదుపు మార్గం అనే అభిప్రాయం వినిపిస్తోంది. దశాబ్దాలుగా భారతీయులు గ్యారంటెడ్ రిటర్న్స్ హామీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనే పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి మదుపు పథకాలైనా.. కొన్నేండ్లుగా వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడంతో మదుపర్లకు వచ్చే రిటర్న్స్ తగ్గుతాయి. అటువంటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేముందు ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పడిపోయాయి. కానీ చాలా మంది తమ ఫిక్సడ్ డిపాజిట్లను అధిక వడ్డీరేటు పథకాల్లోనే చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో చూద్దామా..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేండ్ల ఫిక్సడ్ డిపాజిట్లపై ఏడు శాతం వడ్డీరేటు అందిస్తోంది. చిన్న ఫైనాన్స్ సంస్థల్లో ఉత్తమ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకు ఇదే. రూ.లక్ష మదుపు చేస్తే, మూడేండ్ల తర్వాత రూ.1.23 లక్షల రిటర్న్స్ వస్తాయి. కనీసం రూ.1000 మదుపు చేయాల్సి ఉంటుంది.
ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.21 లక్షల రిటర్న్స్ వస్తాయి.
ఆర్బీఎల్ బ్యాంక్ 6.30 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తోంది. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్లలో రూ.1.21 లక్షలు లభిస్తాయి. మరో ప్రైవేట్ బ్యాంక్ .. యెస్ బ్యాంక్ 6.25 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.20 లక్షల రిటర్న్స్ వస్తాయి. కనీస మదుపు మొత్తం రూ.10 వేలు.
ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్ మూడేండ్ల ఎఫ్డీపై ఆరు శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.19 లక్షలు వస్తాయి. కనీస మదుపు రూ.10 వేలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

