ముంబై: అమెరికా మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలతో డాలర్ బలహీనపడిన నేపథ్యంలో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది.
గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 26 పైసలు పుంజుకుని 81.85 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు ఇండెక్స్ 100.70 స్థాయికి పడిపోయింది.