ఫార్మా ఎగుమతులకు సెగ
దేశీయ ఫార్మా ఎగుమతులకు ధరల సెగ గట్టిగానే తగులబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి 10 శాతానికి పరిమితం కానున్నదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనర్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు.
- 2022-23లో 10%వృద్ధి
- ఫార్మాగ్జిల్ డీజీ ఉదయ్ భాస్కర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12: దేశీయ ఫార్మా ఎగుమతులకు ధరల సెగ గట్టిగానే తగులబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి 10 శాతానికి పరిమితం కానున్నదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనర్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. తనిఖీలు, ధరల ఒత్తిడి, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం ఏర్పడటంతో ఈ ఏడాది ఎగుమతులపై ప్రభావం పడనున్నదని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఔషధాలు ఎగుమతి అయ్యాయి.
- దేశీయ ఎగుమతుల్లో 55 శాతం ఉత్తర అమెరికా, యూరప్‌లకు అవుతున్నాయి.
- 2019-20లో 20.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగగా, ఆ తర్వాత ఏడాది 24.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
- వీటిలో ఫార్ములేషన్, బయోలాజిక్స్ వాటా 73.3 శాతంగా ఉండగా..బల్క్ డ్రగ్గ్స్, డ్రగ్గ్ ఇంటర్మిడియట్స్ 18 శాతంగా ఉన్నది.
- ఫార్మాల్లో 11వ స్థానంలో ఉన్న భారత్..2025 నాటికి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది.
- సంస్థల టర్నోవర్ విషయంలో టాప్ 20 గ్లోబల్ జనరిక్ కంపెనీల్లో ఏడు భారత్‌కు చెందినవి కావడం విశేషం.
- 2021-22లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు ఔషధాలు ఎగుమతి అయ్యాయి.
21 నుంచి అంతర్జాతీయ ప్రదర్శన
కేంద్ర పరిశ్రమలు, ఆరోగ్య మంత్రిత్వశాఖల సహకారంతో ఫార్మా అండ్ హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫార్మా అండ్ హెల్త్‌కేర్ (ఐపెక్స్) ఎనిమిదోవ అంతర్జాతీయ ప్రదర్శన ఈ నెల 21నుంచి 23 వరకు నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో జరగనుందని ఐపెక్స్ చైర్మన్ డా. సీ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 350 మంది భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు, 50 కన్నా ఎక్కువ దేశాలనుంచి 700కిపైగా కొనుగోలుదారులు, వివిధ దేశాలకు చెందిన రెగ్యులేటరీ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఫార్మా సిటీతో మరింత ఊపు..
ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చర్లలో అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీతో ఫార్మా రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భాస్కర్ తెలిపారు. ఈ ఫార్మా సిటీతో దేశీయ ఔషధాల వినిమయంతోపాటు ఎగుమతులు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

