పుణె, మార్చి 4: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..అప్‌గ్రేడ్ చేసిన పల్సర్ ఎన్ఎస్ మాడల్‌ను పరిచయం చేసింది. 2024 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎన్200, ఎన్160, ఎన్ఎస్125 మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎన్ఎస్ 200 మాడల్ ధర రూ.1,57,427గాను, ఎన్ఎస్160 ధర రూ.1,45,792, ఎన్ఎస్125 మాడల్ ధరను రూ.1,04,922గా నిర్ణయించింది.