న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశంలో జుట్టు మార్పిడి మార్కెట్ శరవేగంగా దూసుకుపోతున్నది. గడిచిన ఏడాది 180 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2032 నాటికి మూడింతలు పెరిగి 560 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వరల్డ్ ఫాలిక్యూలర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రదీప్ సేథీ తెలిపారు. ఇటీవలకాలంలో జుట్టు మార్పిడికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అత్యధికంగా వాడుతుండటం కూడా ఇందు కు కారణమన్నారు.
గురుగ్రామ్‌లో యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్‌కు వచ్చే కస్టమర్లలో 40 శాతం మంది అమెరికా లేదా యూరప్ నుంచి వస్తుండటం విశేషమన్నారు. 2023 నుంచి 2032 మధ్యకాలంలో జుట్టు మార్పిడి మార్కెట్ సరాసరి 12 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియా, యూఎస్, ఆఫ్రికా, యూరప్ దేశాల నుంచి క్లయింట్లు వస్తున్నట్లు చెప్పారు.