దేశీయ స్టాక్ మార్కెట్ కరెక్షన్ దాదాపుగా ఖాయమైంది. నిఫ్టీ జీవితకాలపు గరిష్ఠ స్థాయి నుంచి 11.79 శాతం కరెక్షన్కు గురైంది. సాధారణంగా 10 శాతం కరెక్షన్ జరిగితే బేర్ మార్కెట్‌కు తొలి సంకేతంగా పరిగణిస్తారు. గతేడాది మార్చి తర్వాత ఇంతగా కరెక్షన్కు గురి కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య 8.5 శాతం మేర మార్కెట్ కరెక్షన్కు గురైంది. అయితే తాజా కరెక్షన్లో చాలా ఇండికేటర్లు స్పష్టమైన బేరిష్ సంకేతాలను ఇస్తున్నాయి. గత శుక్రవారం నాటి పతనంతో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏర్పడింది. దీంతోనే మూడు రోజుల ర్యాలీ తర్వాత కూడా బేరిష్ సంకేతాలు వచ్చాయి. ప్రస్తుతం నిఫ్టీకి లక్ష్యం 16,211-16,293 మధ్య ఉన్నది. ఈ స్థాయిలో మార్కెట్ కన్సాలిడేటై బడ్జెట్ ప్రతిపాదనల ట్రిగ్గర్స్ కోసం వేచి చూడవచ్చు.
వ్యూహం: గత శుక్రవారం 20 రోజుల చలన సగటు వద్ద నిఫ్టీ రెసిస్టెన్స్‌ను ఎదుర్కొన్నది. 17,155 స్థాయిని అధిగమిస్తేనే మళ్లీ అప్‌ట్రెండ్ కొనసాగుతుంది. అప్పటిదాకా కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మేలు. ఈ వారంతో డిసెంబర్ డెరివేటివ్స్ సిరీస్ ముగుస్తున్నందున ఒడిదుడుకులుంటాయి.
ఏ రంగాలు మేలు: ఐటీ, మెటల్, ఫార్మా
బుల్లిష్ స్టాక్స్: హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ, కోఫోర్జ్, ఏషియన్ పెయింట్స్, ఎఫ్ఎస్ఎల్
బేరిష్ స్టాక్స్: బయోకాన్, టొరెంట్ ఫార్మా, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీవీఆర్, పీఎన్బీ, గ్రాసిమ్ షేర్లు బలహీనంగా కనిపిస్తున్నాయి.