HDFC Bank Data Breach | షాకింగ్ న్యూస్.. డార్క్ వెబ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల డేటా లీక్?
HDFC | దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారులు ఆపదలో చిక్కుకున్నారు. వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటా లీకైంది. ఓ ప్రఖ్యాత అండర్‌గ్రౌండ్ హ్యాకర్ ఫోరంకు చెందిన వినియోగదారుడు ఈ డాటాను డార్క్‌వెబ్‌లో పోస్టు చేయడంతోపాటు ఉచితంగా ఆ డాటాను డౌన్లోడ్ చేసుకునేలా చేశాడు.
HDFC Bank Data Breach | న్యూఢిల్లీ, మార్చి 6: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారులు ఆపదలో చిక్కుకున్నారు. వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటా లీకైంది. ఓ ప్రఖ్యాత అండర్‌గ్రౌండ్ హ్యాకర్ ఫోరంకు చెందిన వినియోగదారుడు ఈ డాటాను డార్క్‌వెబ్‌లో పోస్టు చేయడంతోపాటు ఉచితంగా ఆ డాటాను డౌన్లోడ్ చేసుకునేలా చేశాడు.
లీక్ అయిన డాటాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టిన తేదీలు, వయసు, ఫోన్‌నంబర్లు, వ్యక్తిగత ఈ-మెయిల్, వైవాహిక స్థితి, నివాస, శాశ్వత చిరునామాలు, పిన్కోడ్లు, ఉద్యోగ, రుణ సమాచారం, లావాదేవీల పద్ధతులు, క్రెడిట్ స్కోర్లు సహా పలు ఇతర వివరాలు ఉన్నట్టు ఆ హ్యాకర్ తన పోస్టులో పేర్కొన్నాడు. దాన్ని బలపర్చేలా కొన్ని ‘డాటా శాంపిళ్ల’ను కూడా పోస్టు చేశాడు. వాటి స్క్రీన్షాట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల ఖాతా నంబర్లు, కస్టమర్ ఐడీలు, పాస్వర్డ్లు, పిన్ నంబర్లు మినహా వారి పేర్లు, ఇంటి పేర్లు, అప్లికేషన్ స్టేటస్ తదితర వివరాలన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, తమ బ్యాంక్ నుంచి డాటా లీక్ అయ్యే చాన్సే లేదని బ్యాంక్ వివరణ ఇచ్చింది. తమ వ్యవస్థను వేరేవాళ్లు యాక్సెస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

