హైదరాబాద్, మే 20: హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుటెక్ సేవల సంస్థ నెక్ట్స్‌వేవ్..తాజాగా ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చిలలో 10 క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ క్యాంపస్‌లు అందుబాటులోకి రానున్నట్లు, ఒక్కో క్యాంపస్‌లో 750 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుంటుందని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు.
ఇందుకోసం ఒక్కో క్యాంపస్ కోసం రూ.15-16 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్లు, మొత్తంగా రూ.150-200 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలో సేకరించిన నిధులతోనే ఈ పెట్టుబడులు చేయనున్నట్లు, కొత్తగా నిధులను సేకరించే ఉద్దేశమేది ప్రస్తుతానికి లేదన్నారు. అలాగే ఈ క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తే కొత్తగా 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ప్రస్తుతం సంస్థలో 1,400 మంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.