Elon Musk | ట్రంప్‌తో విభేదాలు.. 14 శాతం పతనమైన టెస్లా షేర్లు.. మస్క్‌కు రూ.13 లక్షల కోట్ల నష్టం
Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య స్నేహబంధం చెడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య స్నేహబంధం చెడింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవల డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్.. బహిరంగంగానే ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అదేసమయంలో మస్క్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆయన సంస్థ టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి (Tesla shares dropped). గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా (Teslas) షేర్లు ఏకంగా 14శాతం పతనమయ్యాయి. దాదాపు 152 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షల కోట్లన్నమాట. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్‌ను కోల్పోయి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్-మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కిల్ ది బిల్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది.
Also Read..
ట్రంప్ X మస్క్.. నిన్నటివరకూ మిత్రులు.. నేడు విరోధులు
కుక్‌ను బెదిరించిన మస్క్.. తన ఆఫర్‌ను కాదన్నందుకు పగబట్టి ప్రతీకారం
ఫ్లిప్‌కార్ట్.. ఎన్బీఎఫ్సీ సేవలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

