TRAI | ఇక నుంచి టెలీ మార్కెటీర్ వ్యక్తిగత మొబైల్ ఫోన్ యూజర్లకు స్పామ్ కాల్స్ చేసినా, టెక్ట్స్ మెసేజ్ పంపినా.. సదరు టెలీ మార్కెటీర్ ఫోన్ నంబర్ డిస్కనెక్ట్ చేయాలని నిర్ణయించింది. స్పామ్ కాల్స్, స్పామ్ టెక్ట్స్ పంపే ఫోన్ నంబర్లను తొలగించేందుకు భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చర్యలు చేపట్టింది. స్పామ్ కాల్స్, స్పామ్ టెక్ట్స్ పంపుతున్న మొబైల్ ఫోన్ నంబర్లు బ్లాక్ లిస్ట్ చేస్తామని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గత మూడు నెలల్లో 800 కంపెనీలకు చెందిన 18 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ లిస్ట్ చేశామన్నారు. మొబైల్ ఫోన్ కస్టమర్ల ప్రైవసీపై స్పామ్ కాల్స్, టెక్ట్స్ మెసేజ్ లు భారీ దాడి చేస్తున్నాయి. రిజిస్టర్డ్ టెలీ మార్కెటీర్ల కోసం సమగ్ర నియంత్రణ వ్యవస్థను కలిగి ఉందని అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు.