ఏరోస్పేస్లో రారాజు
ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్‌తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో దిగ్గజం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ గురించి చెప్పాలంటే ఇలా పెద్ద జాబితానే ఉన్నది.
- రక్షణ రంగంలోనూ దిగ్గజం
- ప్రపంచవ్యాప్తంగా శాఫ్రాన్ వ్యాపారాలు
హైదరాబాద్, జూలై 6: ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్‌తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో దిగ్గజం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ గురించి చెప్పాలంటే ఇలా పెద్ద జాబితానే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ కంపెనీ.. ఇప్పుడు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది.
2005 మే 11న స్నెక్మా, సగెం కంపెనీల విలీనంతో శాఫ్రాన్ గ్రూప్ ఆవిర్భవించింది. అనేక అనుబంధ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఎయిర్‌బస్ గ్రూప్, బోయింగ్లతోనూ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఇక 2018 ఫిబ్రవరిలో జోడియాక్ ఏరోస్పేస్ను శాఫ్రాన్ చేజిక్కించుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల్లో సంస్థకిది ఎంతో కలిసొచ్చిన డీల్. ఈ క్రమంలో భాగ్యనగరంలో రూ.1,200 కోట్లతో ప్లాంట్‌ను తెస్తున్నది. ప్రస్తుతం దేశ, విదేశాల్లో నడుస్తున్న ఎన్నో ఎయిర్‌లైన్స్ విమానాల్లో శాఫ్రాన్ ఇంజిన్లే ఉన్నాయి. ఇకపై వీటి మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ హైదరాబాద్‌లో జరగనుందన్నమాట.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి


