Tecno Spark Go 1 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో స్పార్క్ గో1 (Tecno Spark Go 1) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటరైన టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go1) ఫోన్ 13 – మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెన్సర్, డీటీఎస్ సౌండ్ బ్యాక్డ్ డ్యుయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
టెక్నో స్పార్క్ గో1 (Tecno Spark Go 1 ) ఫోన్ రూ.9000 లోపు ధరకే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. గ్లిట్టరీ వైట్, స్టార్ రైల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో నాలుగు ర్యామ్ అండ్ స్టోరేజీ ఆప్షన్లు – 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 3 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. వర్చువల్గా 4 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు.
టెక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1 ) ఫోన్ గ్లోబల్ వేరియంట్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (720×1600 పిక్సెల్స్) స్క్రీన్ ఉంటది. ఫ్రంట్ కెమెరా సెన్సర్ కోసం హోల్ పంచ్ కటౌట్ ఉంటది. యూనిసోక్ టీ615 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
టక్నో స్పార్క్ గో 1 (Tecno Spark Go 1 ) ఫోన్ 13-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్, డ్యుయల్ రేర్ ఫ్లాష్ యూనిట్స్, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంటాయి. డీటీఎస్ సౌండ్ బ్యాక్డ్ డ్యుయల్ స్పీకర్లు పని చేస్తాయి. నోటిఫికేషన్లను తెలిపేందుకు డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండొచ్చునని భావిస్తున్నారు.