Tecno | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ (Tecno Phantom V Fold 2 5G), ఫాంటం వీ ఫ్లిప్ 2 (Tecno Phantom V Flip 2) ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటిల్లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్స్తోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. రెండింటిలోనూ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ ఓఎస్ పై పని చేస్తాయి. టెక్నో ఏఐ ఫీచర్లకు మద్దతుగా ఉంటాయి.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.92,200 (1099 డాలర్లు) ఉండొచ్చునని భావిస్తున్నారు. కార్స్ట్ గ్రీన్, రిప్లింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ రూ.58,600 (699 డాలర్లు) పలుకుతుంది. మూన్ డస్ట్ గ్రే, ట్రావర్టైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 23 నుంచి ఆఫ్రికాలో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా దేశాల్లో వచ్చేనెలలో సేల్స్ మొదలవుతాయి.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. 6.42 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2550 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ , 7.85 అంగుళాల 2కే + (2000×2296 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌తో పని చేస్తుందీ ఫోన్. ఔట్ సైడ్‌లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, ఇన్ సైడ్ లో రెండు 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. ఈ ఇన్ సైడ్ కెమెరాలతో సెల్ఫీలూ తీసుకోవడంతోపాటు వీడియో కాల్స్ మాట్లాడొచ్చు.
టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, హాల్ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. 70వాట్ల ఆల్ట్రా చార్జ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5750 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఔట్ సైడ్ లో 3.64 అంగుళాల (1066x 1056 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, అన్ ఫోల్డ్ చేసినప్పుడు 32-మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటోఫోకస్ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై6, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, ఆల్ట్రాసోనిక్ ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్, హాల్ సెన్సర్ వంటి సెన్సర్లు ఉంటాయి. 70వాట్ల చార్జింగ్ మద్దతుతో 4720 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.