హైదరాబాద్, నవంబర్ 7: దేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్యుటెక్ కంపెనీ లీడ్ గ్రూపు ఇటీవల టెక్‌బుక్ సేవలను ఆరంభించింది. సంప్రదాయ టెక్స్బుక్లకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్‌బుక్ సేవలను ఇటీవల ప్రారంభించింది.
ప్రస్తుతం టెక్బుక్తో తెలంగాణతోపాటు ఏపీల్లో 100కి పైగా స్కూళ్లకు ఈ అత్యాధునిక టెక్నాలతో చదువులకు సంబంధించిన సేవలు అందిస్తుండగా, వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే మూడేండ్లలో 500 స్కూళ్లకు పెంచుకోనున్నట్లు లీడ్ గ్రూపు కో-ఫౌండర్, సీఈవో సుమీత్ మెహతా తెలిపారు.
విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్లపై మరింత పట్టు సాధించడానికి ఈ నూతన టెక్నాలజీ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని, ప్రస్తుతం సీబీఎస్ఈ బోధిస్తున్న స్కూళ్లకు మాత్రమే ఈ టెక్నాలజీ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 1,200 మంది సిబ్బంది ఉన్నారని, వచ్చే మూడేండ్లలో వీరి సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు ప్రకటించారు.