g-mail large data | లార్జ్ డేటా మెయిల్ పంపేందుకు ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
g-mail large data | ఫోటోలు, కీలక డాక్యుమెంట్లతో కూడిన లార్జ్ డేటాను జీ-మెయిల్ లో పంపడానికి ముందుగా ఆ డేటా గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
g-mail large data |ఇప్పుడు టెక్ నిపుణులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది.. ప్రతి ఒక్కరూ ఈ-మెయిల్స్ ద్వారా సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. అలా నిత్యం సమాచార మార్పిడి జరిగే ఈ-మెయిల్స్‌లో జీ-మెయిల్ (Gmail) మొదటి స్థానంలో నిలుస్తుంది. గూగుల్ అందిస్తున్న ఈ జీమెయిల్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. క్వాలిటీ మిస్ కాకుండా ఫోటోలు పంపాలన్నా, కీలక ఫైల్స్, డాక్యుమెంట్లు ఇతరులకు పంపాలన్నా ఎక్కువ మందికి జీ-మెయిల్ ఆధారం. అయితే, మీరు జీ-మెయిల్లో 25ఎంబీ కంటే ఎక్కువ స్టోరేజీ గల ఫైల్స్ పంపడానికి ప్రయత్నిస్తే జీ-మెయిల్ అడ్డుకుంటుంది. ఇటువంటి సమస్య రాకుండా తేలిగ్గా భారీ డేటా (Large Data Documents) పంపడానికి ఓ పరిష్కారం అందుబాటులో ఉంది.
మీరు మెయిల్ చేయాలనుకున్న ఫైల్, వీడియోలను ముందు గూగుల్ డ్రైవ్‌లో అప్ లోడ్ చేసుకోవాలి. జీ-మెయిల్ పంపుతున్నప్పుడు కుడివైపు స్క్రీన్ పై కనిపించే డ్రైవ్ ఐకాన్ ఎంచుకోవాలి. డెస్క్ టాప్ కంప్యూటర్లో గూగుల్ డ్రైవ్ ఐకాన్ దిగువన ఉంటుంది. ఈ ఐకాన్ క్లిక్ చేయగానే రెండు ఆప్షన్లు వస్తాయి. వాటిలో ఇన్ సర్ట్ ఫ్రం డ్రైవ్ (Insert from Drive)’ ఆప్షన్ క్లిక్ చేసి.. అటుపై మై డ్రైవ్ (My Drive) ఆప్షన్ ఎంచుకోవాలి.
అటుపై మీరు గూగుల్ డ్రైవ్ లో అటాచ్ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి. అందులో పంపాలనుకున్న లార్జ్ ఫైల్ ఎంచుకుని ‘సెలెక్ట్ (Select)’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన ఫైల్ లింక్‌ను గూగుల్ క్రియేట్ చేసి ఆటోమేటిక్‌గా జీ-మెయిల్ కు సెండ్ చేస్తుంది. మెయిల్ సెండ్ చేయడానికి ముందు కేవలం ఆ లింక్ అందుకున్న వారే యాక్సెస్ చేయాలా..? ఎవరైనా యాక్సెస్ చేయొచ్చా? అన్న ఆప్షన్లలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకుని మెయిల్ పంపొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

