ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో(TCS CEO) కే శ్రీనివాసన్ ఈ యేడాది జీతం కింద 26.52 కోట్లు ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ఆదాయం 4.6 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2025 మార్చి వార్షిక ఏడాది వరకు 26.52 కోట్లు జీతం పొందినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొన్నది. గత ఏడాది 25.35 కోట్లు ఆర్జించారు. గత ఏడాది నెల జీతం 1.27 కోట్లు ఉండగా, తాజాగా ఆ జీతాన్ని 1.39 కోట్లకు పెంచారు. బెనిఫిట్స్, అలవెన్స్ రూపంలో 2.12 కోట్లు శ్రీనివాసన్ ఆర్జించారు. కమీషన్ రూపంలో 23 కోట్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. టీసీఎస్ కంపెనీ గత ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచింది. 4.5 శాతం నుంచి 7 శాతానికి పెంపు జరిగింది.టాప్ పర్ఫార్మర్లకు డబుల్ డిజిట్ సంఖ్యలో జీతాన్ని పెంచేవారు. ఇతర దేశాల్లో పనిచేస్తున్న టీసీఎస్ ఉద్యోగులకు 1.5 శాతం నుంచి 6 శాతం వరకు హైక్ ఇచ్చారు.