Topup Homeloan | పన్ను బెనిఫిట్లకు టాపప్ హోంలోన్ అతిచౌక.. ఎందుకంటే?!
Topup Homeloan | ఇంటిరుణం తీసుకున్న వారు టాక్స్ బెనిఫిట్లు పొందేందుకు టాపప్ హోంలోన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఆదాయం పన్ను చట్టంలోని 24 సెక్షన్ కింద గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
Topup Homeloan | మీరు ఇప్పటికే ఇంటి రుణ వాయిదాలు చెల్లిస్తున్నారా.. అయినా ఇంటి మరమ్మతుల కోసం నిధులు అవసరం కావచ్చు. అటువంటప్పుడు హోంలోన్‌పై టాపప్ లోన్ బెస్ట్ లోన్ ఆప్షన్ కానున్నది. ‘ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణంపై ఇంటి యజమానులు అదనపు రుణానికి అనుమతించడం ఒక హోంలోన్ టాపప్ లోన్. ఇలా తీసుకున్న అదనపు రుణాన్ని హోం రెనోవేషన్, వివిధ రకాల అవసరాలకు వినియోగించొచ్చు’ అని బ్యాంక్ బజార్ డాట్ కాం సీఈవో అదిల్శెట్టి అంటున్నారు. ఇతర రుణాల కంటే టాపప్ హోంలోన్ మెరుగని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇతర పర్సనల్ లోన్ల కంటే టాపప్ లోన్ చౌక కూడా. రిటైల్ రుణ గ్రహీతలకు అతి తక్కువ వడ్డీరేటుతో లభించే సెక్యూర్డ్ లోన్ హోంలోన్. అదే హోంలోన్ టాపప్ విషయంలోనూ ఎటువంటి మార్పులు ఉండవు.
‘పర్సనల్ లోన్ వంటి ఇతర రుణాలతో పోలిస్తే టాపప్ హోంలోన్లపై తక్కువ వడ్డీరేటు విధిస్తారు. దీనివల్ల సుదీర్ఘకాలంలో వడ్డీ చెల్లింపులపై మనీ పొదుపు చేయడానికి మీకు సాయంగా ఉంటుంది’ అని అదిల్ శెట్టి తెలిపారు. అయితే, రెగ్యులర్ హోంలోన్‌తో పోలిస్తే టాపప్ హోంలోన్‌పై వడ్డీరేటు స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది కానీ, ఇతర రుణ ఆప్షన్ల కంటే మాత్రం చౌక. ఉదాహరణకు ఇండ్ల రుణాలపై ఎస్బీఐ అతి తక్కువగా 9.15 శాతం వడ్డీ వసూలు చేస్తే, టాపప్ హోంలోన్‌పై 9.55 శాతం నుంచి వడ్డీ ప్రారంభం అవుతుంది.
కొత్త హోంలోన్ మాదిరిగా టాపప్ హోంలోన్కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. టాపప్ హోంలోన్ తేలిగ్గానే పొందొచ్చు. ‘ఇప్పటికే మీ సొంతమైన ఆస్తిపైన టాపప్ హోంలోన్ తీసుకుంటున్నందున కొత్తగా అదనపు కొల్లెటరల్ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇంటి రుణ గ్రహీత గురించి బ్యాంకుకు పూర్తి వివరాలు తెలుసు. రుణాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం రుణ దాత బ్యాంకర్వద్దే ఉంటుంది. కనుక హోంలోన్ కంటే వేగంగా టాపప్ హోంలోన్ ప్రక్రియ వడివడిగా పూర్తవుతుంది.
ఇంటి రుణంపై మాదిరిగానే టాపప్ హోంలోన్ రీ పేమెంట్‌పై ఆదాయం పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఒకవేళ, మీరు తీసుకున్న టాపప్ హోంలోన్‌ను ఇంటి మరమ్మతులు, రెన్యూవేషన్ పనులకు ఉపయోగిస్తే ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ -24 కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. రుణం అసలుపై మాత్రమే కాదు టాపప్ హోంలోన్ వడ్డీ చెల్లింపులపైనా ట్యాక్స్ డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు. ఇంటి రుణం తీసుకున్న వారు సెక్షన్-24 కింద గరిష్టంగా రూ.2లక్షల వరకు పన్ను చెల్లింపుపై డిడక్షన్ పొందొచ్చు.
కొందరు సొంత ఇంటిపై టాపప్ హోంలోన్ తీసుకుంటారు. అటువంటి వారికి ఆదాయం పన్ను చట్టంలోని 24 సెక్షన్ ప్రకారం గరిష్టంగా రూ.30 వేల వరకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఓవరాల్‌గా రూ.2 లక్షల వరకు పన్ను రాయితీ లభిస్తుంది. లెట్ఔట్ ప్రాపర్టీ అయితే మీరు ఆ ఇంటిపై తీసుకున్న టాపప్ లోన్ మీద వడ్డీ చెల్లింపులకు అపరిమితంగా పన్ను మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. అయితే గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు పరిమితం చేశారు. అదీ కూడా ఎనిమిదేండ్ల పాటు మాత్రమే రూ.2 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందొచ్చు.
కొందరు టాపప్ హోంలోన్ తీసుకుని కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. అలా కొత్త ఆస్తి కొనుగోలు చేయడానికి గానీ, కొత్త ఇంటి నిర్మాణానికి గానీ ఆ టాపప్ లోన్ ఖర్చు చేస్తే మాత్రం.. రుణం అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 24 (బీ), సెక్షన్- 80సీ కింద మాత్రమే పన్ను మినహాయింపులు పొందగలుగుతారని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
- అన్ని రకాల టాపప్ హోంలోన్లకు కూడా టాక్స్ బెనిఫిట్లు లభించకపోవచ్చు.
- ఇప్పటికే ఉన్న ఇంటికి మరమ్మతులు, రెనోవేషన్, కొత్త ఆస్తి కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పన్ను బెనిఫిట్లు క్లయిమ్ చేయవచ్చు.
- టాపప్ హోంలోన్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే పన్ను బెనిఫిట్లు లభించవు.
- ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీతలు ఏడాది తర్వాత టాపప్ హోంలోన్ తీసుకోవచ్చు లేదా ఇంటి రుణంపై 12 రుణ వాయిదాలు చెల్లించిన తర్వాత రుణ గ్రహీతలు టాపప్ లోన్ తీసుకునేందుకు అర్హులు.
- వార్షిక వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల్లోపు ఉంటే.. సంబంధిత రుణ గ్రహీత పన్ను మినహాయింపు కోసం టాపప్ హోంలోన్ తీసుకోవచ్చు.
- అవసరమైతేనే టాపప్ హోంలోన్ తీసుకోవాలి.
- వ్యక్తిగత అవసరాలకు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌గా వాడుకునేందుకు టాపప్ లోన్ తీసుకోవచ్చు.
- మీ ఆదాయంలో 60 శాతానికి పైగా నెలవారీ రుణ వాయిదాల చెల్లింపులకు ఖర్చు చేస్తున్నట్లయితే పన్ను బెనిఫిట్ల కోసం మరో రునం తీసుకోవడం లాభదాయకం కాదు.
- చెల్లించే సామర్థ్యం ఉన్నప్పుడే రుణం తీసుకోవాలి. టాపప్ హోంలోన్ కూడా అదనపు రుణ భారంగా పరిగణించాలంటున్నారు నిపుణులు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

