న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.17.78 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైనదాంతో పోలిస్తే 15 శాతం అధికమని పేర్కొంది. దీంట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 21 శాతం ఎగబాకి రూ.9.48 లక్షల కోట్లకు చేరుకోగా, నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 6 శాతం అధికమై రూ.7.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్ 65 శాతం అధికమై రూ.49,201 కోట్లకు చేరాయి.