న్యూఢిల్లీ, జనవరి 25: అంతర్జాతీయ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.170.22 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.148.38 కోట్ల లాభంతో పోలిస్తే 14.72 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,123.89 కోట్ల నుంచి రూ.1,289.45 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చులు రూ.947.42 కోట్ల నుంచి రూ.1,085.14 కోట్లకు చేరుకున్నాయి.