ముంబై, జూన్ 29: కాంట్రాక్టు సిబ్బంది నియామకాల్లో కొన్ని స్టాఫింగ్ సంస్థలకు అనుకూలంగా పనిచేసిన ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు తీసుకున్నదని, మరో ముగ్గురి పాత్రపై దర్యా ప్తు చేస్తున్నట్టు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు.
గురువారం టీసీఎస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘మేము ఆరుగురు ఉద్యోగుల్ని, 6 స్టాఫింగ్ కంపెనీలను నిషేధించాం’ అని చెప్పా రు. బిజినెస్ అసోసియేట్స్/కాంట్రాక్చువల్ వర్కర్స్ నియామకాలకు సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూఎస్‌లో ఒకటి, ఇండియాలో మరొకటి-రెండు వేర్వేరు ఫిర్యాదులు కంపెనీకి అందాయని వివరించారు.