న్యూఢిల్లీ, మార్చి 20: టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ సంస్థ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 0.5 శాతం మేర సవరిస్తున్నట్టు పేర్కొంది.
ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో ఇంటర్నల్ కంబ్యూస్టన్ ఇంజిన్(ఐసీఈ)తో తయారైన వాహనాలతోపాటు ఇతర వాహన ధరలను కూడా సవరిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ రూ.4.57 – 23.42 లక్షల లోపు ధరతో విక్రయిస్తున్నది.