న్యూఢిల్లీ, మే 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.5,408 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,033 కోట్లతో పోలిస్తే నాలుగురెట్లు పెరిగింది.
ఏడాది క్రితం రూ.78,439 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.1,05,932 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,45,967 కోట్ల ఆదాయంపై రూ.2,414 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.