Ford India | టాటాతోపాటు క్యూలో మరో 3 సంస్థలు.. ఫోర్డ్ యూనిట్లపై కన్ను?!
Ford India | భారత్ నుంచి నిష్క్రమించనున్న ఫోర్డ్ యూనిట్ల టేకోవర్‌పై టాటా మోటార్స్‌తోపాటు మూడు సంస్థలు పోటీలో ఉన్నాయి.

భారత్‌లో కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా కంపెనీ ఫోర్డ్‌కు భారత్‌లో గల రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను కైవశం చేసుకోవడంపై దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు క్యూ కట్టాయి. రెండు దశాబ్దాలకు పైగా దేశంలో కార్ల ఉత్పత్తి చేసిన ఫోర్డ్..200 కోట్ల డాలర్ల నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ భారత్ విపణి నుంచి నిష్క్రమిస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయా యూనిట్లను ఇతర కంపెనీలు టేకోవర్ చేయడానికి వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగుల భవితవ్యమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పర్సనల్ మొబిలిటీకి ఫుల్ గిరాకీ
ఈ నేపథ్యంలో గుజరాత్, తమిళనాడులలో గల ఫోర్డ్ ఇండియా ప్లాంట్లను కొనుగోలు చేయడానికి టాటా మోటార్స్‌తోపాటు కియా, ఎంజీ హెక్టార్ తయారీ సంస్థ సియాక్ మోటార్స్ ముందుకొచ్చాయి. కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి డిమాండ్ పెరిగింది. గిరాకీకి అనుగుణంగా సరఫరా చేయాలంటే ఆరు నెలలకు పైగా టైం పడుతున్నది. కంపెనీలు అనుమతులు తీసుకుని ఉత్పత్తి యూనిట్ ప్రారంభించాలంటే రెండేండ్లు టైం తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన కంపెనీలు.. ఫోర్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి మొగ్గుతున్నాయని తెలుస్తోంది.
ఫోర్డ్‌తో టాటా.. మహీంద్రా చర్చలు..
ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ కావడంతో ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను ఫోర్డ్ యాజమాన్యం ఖండించిందని ఫోర్డ్ చెన్నై యూనిట్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా చర్చలు జరిపినట్లు చెబుతున్నా ఆ రెండు కంపెనీలు స్పందించలేదు.
తమిళ సర్కార్ వైఖరి ఇలా
తమిళనాడు సర్కార్.. చెన్నై సమీపంలో గల ఫోర్డ్ ఫ్యాక్టరీతోపాటు ఉద్యోగులనూ తీసుకునే సంస్థ కోసం వేచి చూస్తున్నది. మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న సియాక్, కియా.. ఉద్యోగులను తమలో కలుపుకునేందుకు అనుకూలంగా లేవని సమాచారం. చెన్నై యూనిట్‌కు 450 కి.మీ. దూరంలో అనంతపురంలో కియా మోటార్స్ యూనిట్ ఉంది. ఇక గుజరాత్‌లోని సనంద్ యూనిట్‌కు 160 కిమీ దూరంలో సియాక్ హలోల్ ప్లాంట్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కియా, సియాక్ ఆసక్తి చూపుతున్నట్లు తెలియవచ్చింది.
చెన్నైకి సమీపంలోని మరమలాయ్నగర్లోని ఫోర్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏడాదిలో రెండు లక్షల వాహనాలు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 2.40 లక్షల కార్లు, 2.70 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
TATA-Air India | టాటాసన్స్కు ఎయిరిండియా మేనేజ్మెంట్ వీజీ కాదా..?!
Fixed Diposits | ఈ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు.. 7 శాతం వడ్డీ వరకు ఆఫర్!
TATA-Air India | ఎయిరిండియా టెక్నికల్ సపోర్ట్ ఇక టీసీఎస్ చేతికి..!
AWS Cloud Training | క్లౌడ్ కంప్యూటింగ్‌లో అమెజాన్ ఉచిత శిక్షణ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

