బుధవారం 03 జూన్ 2020
Business - Apr 23, 2020 , 00:42:51

వాయిదాల్లో తీసుకోండి

వాయిదాల్లో తీసుకోండి

న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియంలను వాయిదా పద్ధతిలో తీసుకునేందుకు ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్‌ ఈ వెసులుబాటును కల్పించింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల ఆదాయం ప్రభావితమైన విషయం తెలిసిందే. కాగా, అందుబాటులో ఉన్న బీమా పాలసీలను, వాయిదాల్లో వాటి ప్రీమియం చెల్లింపుల వివరాలను అన్ని బీమా కంపెనీలు తమతమ అధికారిక వెబ్‌సైట్లలో పేర్కొనాలని ఈ సందర్భంగా ఐఆర్‌డీఏఐ సూచించింది. 


logo