తమ సంస్థ ప్రారంభించి 16 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునేందుకు ‘స్వీట్ 16’ పేరుతో వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో టికెట్లు తీసుకున్న వారికి తక్కువ ధరలకే ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్విటర్లో ఇండిగో తెలిపింది.
ఇండిగో ప్రారంభించి ఇవాల్టికి 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘స్వీట్ 16’ ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఈ ఆఫర్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వస్తున్నది. ఈ ఆఫర్ కింద ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే ఏడాది జూలై 16 వ తేదీ మధ్య విమాన ప్రయాణం టికెట్లపై రాయితీ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ టికెట్లను కేవలం మూడు రోజుల పాటే.. అంటే ఇవాల్టి నుంచి 5 వ తేదీ వరకు ఇస్తారు. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లు రూ.1616 నుంచి మొదలుకానున్నాయి.
‘తమ సంస్థ ద్వారా ప్రయాణానికి అధిక డిమాండ్ వస్తున్నది. ఈ సేల్ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఛార్జీలు రూ.1616 నుంచి ప్రారంభమవుతాయి’ అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆఫర్‌కు తోడుగా కా-చింగ్ కార్డ్స్ వారు 25 శాతం క్యాష్‌బ్యాక్, హెచ్ఎస్బీసీ తమ కార్డుదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించాయి.