SVB | ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టాలి.. ఇన్వెస్టర్లకు బ్యాంకు సీఈవో పిలుపు
SVB | అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (SVB) ఇటీవల దివాళా తీసిన విషయం తెలిసిందే. బ్యాంకు కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ మయోపౌలోస్ (Timothy J Mayopoulos) మళ్లీ బ్యాంకులో డిపాజిట్లు చేయాలని డిపాజిటర్లను కోరారు.
SVB | అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (SVB) ఇటీవల దివాళా తీసిన విషయం తెలిసిందే. బ్యాంకు కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ మయోపౌలోస్ (Timothy J Mayopoulos) మళ్లీ బ్యాంకులో డిపాజిట్లు చేయాలని డిపాజిటర్లను కోరారు. ఎంపిక చేసిన పలువురు పెట్టుబడిదారులు, పరిమిత భాగస్వాములతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకులో డిపాజిట్లు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) ద్వారా ప్రస్తుతం ఉన్న, కొత్త డిపాజిట్లు రెండూ బీమా చేయనున్నట్లు చెప్పారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇంకా మనుగడలో ఉందని నిర్ధారించుకునేందుకు మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం ఇదే అని పెట్టుబడిదారులతో మయోఫౌలోస్ తెలిపారు. బ్యాంక్ అందుబాటులో ఉన్న ఎస్వీబీ, మరో ఆర్థిక సంస్థ, పెట్టుబడిదారులతో కలిసి పని చేయడం ముందున్న దారని, లేకపోతే మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు భవిష్యత్ ఇంకా చర్చల దశలో ఉందన్నారు. అయితే, కనీసం కొంత డబ్బును తిరిగి బ్యాంకులో పెట్టుబడి పెట్టాలని ఖాతాదారులకు విజ్ప్తి చేశారు. కస్టమర్లకు గతంలో మాదిరిగానే ఈమెయిల్, బ్యాంక్ యథావిధిగా వ్యాపారాన్ని నిర్వహిస్తుందన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నామన్నారు.
ఎస్వీబీ నష్టాలకు కారణాలు ఏంటంటే..?
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) అమెరికాలో పెద్ద బ్యాంకు. ఐటీ రంగంలో స్టార్టప్‌లకు రుణాలు అందించే బ్యాంక్‌గా గుర్తింపు పొంది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు పది దేశాల్లో బ్యాంకు కార్యాకలాపాలు కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా స్టార్టప్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జిస్తూ ఎస్వీబీ బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించాయి. దీని కారణంగా 2017లో బ్యాంకు డిపాజిట్లు 3.60 లక్షల కోట్ల నుంచి 2021 చివరి నాటికి 15.50 లక్షల కోట్లకు చేరాయి. అదే సమయంలో రుణాలు మాత్రం రూ.1.90లక్షల కోట్ల నుంచి రూ.5.4 లక్షల కోట్లకు మాత్రమే చేరాయి. ఈ క్రమంలో బ్యాంకు డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ, బ్యాంకు మొత్తం ఆదాయం కంటే చాలా రెట్లు ఎక్కువైంది.
మరోవైపు బ్యాంక్ మిగులు నిధులను ఎక్కువగా ఎస్ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. కానీ, సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచడం పెంచడంతో బాండ్ వడ్డీ రేటు తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో కొత్త పెట్టుబడి తగ్గడంతో కంపెనీలు ఎస్వీబీ నుంచి తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంకు కొనుగోలు చేసిన బాండ్లను తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత బ్యాంకు రూ.16వేలకోట్ల నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మార్కెట్ నుంచి రూ.20వేలకోట్ల సేకరణకు సిద్ధమైనట్లు బ్యాంక్ మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ప్రకటించింది. ఆ తర్వాత బ్యాంకు నష్టపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

