న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశవ్యాప్తంగా వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. జూలై నెలలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ అమ్మకాలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. కానీ, మహీంద్రాఅండ్‌మహీంద్రా అమ్మకాలు 29 శాతం పెరిగాయి. గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లక్షన్నర ప్యాసింజర్ వాహనాలను దేశీయంగా విక్రయించింది. చిప్‌ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలు వచ్చే పండుగ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ద్విచక్ర వాహన సంస్థలు మిశ్రమ పనితీరు కనబరిచాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 2 శాతం తగ్గగా, సుజుకీ మోటర్‌సైకిల్ 80 వేల యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స 42 శాతం చొప్పున పెరిగాయి.

P