హైదరాబాద్, మార్చి 26: అమెరికాకు చెందిన టెక్నాలజీ సొల్యుషన్ సేవల సంస్థ స్టోరబుల్..హైదరాబాద్‌లో కొత్తగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నాలెడ్జ్ సిటీలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం 60 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ఏడాది క్రితం ఆసియాలో తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సంస్థ..ఆర్అండ్డీని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు భారత్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు.