లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 879, నిఫ్టీ 289 పాయింట్లు వృద్ధి
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. వరుసగా రెండు రోజులు పతనమైన సూచీలకు ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చింది.
ముంబై, అక్టోబర్ 9: వారాంతపు ట్రేడింగ్‌లో ఒక దశలో వెయ్యి పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్.. చివరికి 879.09 పాయింట్లు లేదా 1.23 శాతం అందుకొని 72,472.33 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288.65 పాయింట్లు లేదా 1.30 శాతం ఎగబాకి 22,520.45 దగ్గర ముగిసింది. మధ్యంతర ఎన్నికలు ముగిసేదాకా ఇరాన్‌పై దాడిచేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు పుంజుకున్నాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రిసర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఇక రంగాలవారీగా ఐటీ సూచీ అత్యధికంగా 2.96 శాతం బలపడగా, ఆతిథ్య 2.46 శాతం, ఎఫ్ఎంసీజీ 2.02 శాతం, మిడ్‌స్మాల్ ప్రైవేట్ బ్యాంకింగ్ 1.91 శాతం, పీఎస్‌యూ బ్యాంకింగ్ 1.37 శాతం, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్ 1.25 శాతం చొప్పున బలపడ్డాయి.
ఐటీ షేర్ల దన్నుతో…
ఐటీ రంగ షేర్లు కదంతొక్కాయి. టీసీఎస్ అంచనాలకుమించి రాణించడంతో కంపెనీ షేరు 4.23 శాతం లాభపడగా, హెక్సావేర్ టెక్నాలజీ 5.69 శాతం, ఎల్‌టీఎం లిమిటెడ్ 4 శాతం, ఇన్ఫోసిస్ 3 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 2.84 శాతం, విప్రో 2.59 శాతం, టెక్ మహీంద్రా 1.43 శాతం చొప్పున బలపడ్డాయి. ఆయా సంస్థల నికర మార్కెట్ విలువ రూ.65,648.78 కోట్లు పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

