Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Share Market : భారత్ స్టాక్ మార్కెట్ వరుసగా లాభాలబాటలో సాగింది. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్ల లాభాలు చవిచూసింది.
Share Market : భారత్ స్టాక్ మార్కెట్ వరుసగా లాభాలబాటలో సాగింది. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్ల లాభాలు చవిచూసింది. అంతకుముందు గురువారం స్టాక్ మార్కెట్ అత్యధికంగా 1500 పాయింట్లుపైగా లాభపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం టెక్నాలజీ, ఐటీ, మెటల్ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడంతో మార్కెట్ లాభాలబాటలో సాగింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 413.66 పాయింట్లు (0.56 శాతం) లాభపడి, 74,729.27 వద్ద ముగిసింది. అంతకుముందు ఒక దశలో 74,778.78 పాయింట్ల గరిష్టాన్ని తాకి, 765.79 పాయింట్ల స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 148.80 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 23,146.15 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ మాత్రం నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 65.74 పాయింట్లు నష్టపోగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 12.63 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 3.92 శాతం లాభపడింది. మరోవైపు రూపాయి స్వల్పంగా లాభపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.95గా ఉంది. బంగారం ఔన్స్ ధర 4,197 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 105.61గా కొనసాగింది. ఇక, బీఎస్ఈ 30 ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 8.45 శాతం లాభపడింది. ఆ తర్వాత టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. అయితే, బీఈఎల్, రిలయన్స్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, ఇండిగో షేర్లు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా ఇండిగో 2.23 శాతం నష్టపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- IT Stocks
- nifty
- Sensex
- Share Market
RELATED ARTICLES
తాజా వార్తలు
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

