Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఉదయం ట్రేడింగ్ భారీ నష్టాలతో ప్రారంభం కాగా.. తర్వాత కొద్దిగా కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 702.68 పాయింట్ల (0.91 శాతం) నష్టంతో 76,847.57 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 75,937.16 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది.
ఒక దశలో 1600 పాయింట్ల నష్టంతో 75,868.32 వద్ద కనిష్టాన్ని చేరుకుంది. తర్వాత కోలుకుని 702 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. 207.95 పాయింట్ల నష్టంతో 23,842.65 వద్ద ముగిసింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం వంటి అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల వంటివి మార్కెట్‌కు భారీ నష్టాలు కలిగించాయి. పీఎస్‌యూ బ్యాంకులు, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ వంటివి సెల్లింగ్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ వంటి కొన్ని స్టాక్స్ మాత్రమే లాభాల్ని చవిచూశాయి. టీసీఎస్, ఇండిగో, మారుతీ సుజుకీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ సంస్థల స్టాక్స్ నష్టపోయాయి.
ఆటో స్టాక్స్ అత్యధిక నష్టాలు చవిచూశాయి. మరోవైపు రూపాయి విలువ పతనమైంది. డాలర్‌తో దాదాపు 56 పైసలు నష్టపోయిన రూపాయి 93.39 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 102 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక ఔన్స్ బంగారం ధర 4717 డాలర్ల వద్ద కొనసాగుతోంది.