నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్ తగ్గుముఖం పట్టినప్పటికీ మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
- సెన్సెక్స్ 171, నిఫ్టీ 33 పాయింట్ల పతనం
ముంబై, ఆగస్టు 24: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు క్రూడాయిల్ తగ్గుముఖం పట్టినప్పటికీ మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి 171.72 పాయింట్ల నష్టంతో 77,369.11 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 32.95 పాయింట్లు కోల్పోయి 24,219.05 వద్ద నిలిచింది. సూచీల్లో అదానీపోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు నష్టపోగా..టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునిలీవర్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.68 శాతం తగ్గి 92.80 డాలర్లకు పడిపోయింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయని, దీంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

