Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,109 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 358 పాయింట్లు లాభపడింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,109 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 358 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు దూసుకెళ్లడం.. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్‌లపై సమీక్ష జరిగే అవకాశం ఉందనే సంకేతాలు.. మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ లాభాలబాట పట్టింది.
ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.4.12 లక్షల కోట్లు పెరిగింది. మొత్తంగా ఒక శాతంపైగా మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం మొత్తం మార్కెట్ విలువ రూ.470 లక్షల కోట్లుగా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు (1.54%) లాభపడి 73,033.78 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 358.60 పాయింట్లు (1.60%) లాభపడి 22,721.95 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ స్వల్పంగా లాభపడింది. అలాగే, నిఫ్టీ మిడ్‌క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే ముగిసింది.
నిఫ్టీ 50 సెలెక్ట్ ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. మంగళవారం డాలర్‌తో 82 పైసలు బలపడ్డ రూపాయి 94.96 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఒక శాతంపైగా తగ్గాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 105 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర 4,182 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

