Steve Jobs | భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి మాదిరే గ్లోబల్ టెక్ జెయింట్ ‘ఆపిల్’ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అంటే అందరిలో క్రేజ్. ఆయన ఏ పని చేసినా టెక్ ప్రియులు అబ్బురంగా భావిస్తుంటారు. ఏనాడూ ఆయన ఏ అభిమానికి కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి సుముఖంగా ఉండేవారు కాదు.. కానీ ఆయన పూర్తి పేరుతో సంతకం చేసిన ఈ చెక్’కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. 1976లో ఒక ఎలక్ట్రానిక్ రిటైలర్ ‘రేడియో షాక్’కు ఇచ్చిన ‘4$’విలువైన ఈ చెక్.. అమెరికాకు చెందిన ‘ఆర్ఆర్ ఆక్షన్’ అనే సంస్థ వేలానికి పెట్టింది. ఇబ్బడి ముబ్బడిగా బిడ్లు దాఖలయ్యాయి. ఈ వేలంలో సదరు చెక్ 36,850 డాలర్లు. మన కరెన్సీలో రూ.30,72,904.92.
1976లోనే స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 9.18 డాలర్ల చెక్ 55 వేల డాలర్లు, గత మార్చిలో ఎల్మార్ ఎలక్ట్రానిక్స్‌కు ఇచ్చిన మరొక 13.86 డాలర్ల చెక్.. 37,564 డాలర్లు పలికింది. అంతకుముందు 1973లో ‘ఎలక్ట్రానిక్ టెక్ లేదా డిజైన్ ఇంజినీర్’ ఉద్యోగం కోసం స్టీవ్ జాబ్ సంతకం చేసిన దరఖాస్తుపై 2018లో వేలం వేస్తే 1,74,757 డాలర్లు పలికింది.
అటుపై మూడేండ్ల తర్వాత ‘ఆపిల్ వ్యవస్థాపక కాంట్రాక్ట్‌పై రొనాల్డ్ వాయ్నే, స్టీవ్ వోజ్నియాక్లతోపాటు స్టీవ్ జాబ్స్ సంతకం గల ‘ఒప్పందం పత్రా’న్ని 2011 డిసెంబర్లో 15,94,500 డాలర్లు పలికింది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఫస్ట్ జనరేషన్ సీల్ ప్యాక్డ్ ఐ-ఫోన్’కు 54,904 డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) పలికింది. 2007లో తిలిసారి మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు తొలి ఐ-ఫోన్ ధర 599 అని మైక్ రూమర్స్ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసిన ఆపిల్ మాజీ ఉద్యోగి తర్వాత ఆర్ఆర్ ఆక్షన్’లో వేలానికి పెట్టారు.
రోజురోజుకు పెరుగుతున్న ‘జాబ్స్ సిగ్నేచర్ అండ్ మెమొరబిలియా’ కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో వెల్స్ ఫార్గో బ్యాంక్ శాఖలో ‘ఆపిల్ కంప్యూటర్ కంపెనీ’ ఖాతా జత కలిసిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది.