స్టార్టప్స్ అడ్డా హైదరాబాద్

- మూడేండ్లలో రూ.3,827 కోట్ల పెట్టుబడుల రాక
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లకు అడ్డాగా హైదరాబాద్ నగరం మారిపోయింది. ఏటా ఇక్కడి నుంచి కొత్త స్టార్టప్‌లు ఏర్పాటవుతుండటంతో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనదైన ముద్రవేసిన భాగ్యనగరం.. స్టార్టప్ల్లోనూ సత్తా చాటుతున్నది. గడిచిన మూడేండ్ల కాలంలో ఇక్కడి స్టార్టప్‌లు రూ.3,827 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించాయి. 2019 నుంచి 2021 మధ్య కాలంలో వెంచర్ క్యాపిటలిస్టులు ఇంత భారీ స్థాయిలో నిధులు చొప్పించారని తాజాగా విడుదల చేసిన నివేదికలో ట్రాక్షన్ వెల్లడించింది. 2021లో ఏర్పాటైన 115 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ వచ్చిందని తన వార్షిక సర్వేలో తెలిపింది. సరికొత్త ఆలోచనలతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. కాగా, గడిచిన ఆరేండ్లలో 4,674 స్టార్టప్‌లు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. గతేడాది 226 కొత్తగా వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

