న్యూఢిల్లీ, మే 30: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీని తీసుకొచ్చింది. టయోటా ఎబెల్లా పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.23.60 లక్షలుగా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు 61 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో గరిష్ఠంగా 541 కిలోమీటర్లు ప్రయాణించనుండగా… 49 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన కారు 344 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 10.1 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ డిస్‌ప్లేతోపాటు 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఫోన్ చార్జర్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్ ప్యూరిఫైర్, ఆటో ఏసీ, భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని టైర్లు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది.