హైదరాబాద్, మే 5: గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో రూ.1,254 కోట్ల విలువైన 1.8 లక్షల పాలసీలు క్లెయిం చేశామని స్టార్ హెల్త్ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు. అంతక్రితం ఏడాది చేసిన రూ.1,014 కోట్ల కంటే ఇది 24 శాతం అధికమని పేర్కొన్నారు. కంపెనీ మొత్తం వ్యాపారంలో తెలుగు రాష్ర్టాల వాటా 10 శాతంగా ఉండగా, వచ్చే మూడు నుంచి నాలుగేండ్లలో ఇది 12 శాతం నుంచి 15 శాతానికి పెరుగనున్నదని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.24 వేల కోట్ల ప్రీమియం వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే సంస్థ 35 హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను విక్రయిస్తున్నది.