హైదరాబాద్, మే 14: రాష్ర్టానికి చెందిన ఇంజినీరింగ్ సేవల సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌జీఎల్‌టీఎల్)..జపాన్‌కు చెందిన ఏజీఐ గ్రూపుతో జట్టుకట్టింది. తన అనుబంధసంస్థయైన జీఎల్ హ్యాక్కోకు చెందిన గ్లాస్-లైన్డ్ షెల్, ట్యూబ్ హీట్ ఎక్సేంజర్లను 20 ఏండ్లపాటు ఇక్కడ తయారు చేయడంతోపాటు మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుపడనున్నది.
ఈ సందర్భంగా ఎస్‌జీఎల్‌టీఎల్ ఎండీ నాగేశ్వర రావు కందుల మాట్లాడుతూ..భారత్‌లో ఈ నూతన శ్రేణి గ్లాస్ లైన్డ్ షెల్ ప్రాడక్ట్‌లను ఉత్పత్తి చేస్తున్న తొలి సంస్థ మాదే కావడం విశేషమన్నారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ ఇండస్ట్రీస్‌లు చాలాకాలంగా గ్రాఫైట్ హీట్ ఎక్సేంజర్లపై ఆధారపడుతున్నాయని, ఈ నూతన శ్రేణి ఉత్పత్తులో వీటిపై ఆధారపడటం తగ్గనున్నదన్నారు.