న్యూఢిల్లీ : బడ్జెట్ విమానయాన సంస్ధ స్పైస్‌జెట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఆశిష్ కుమార్‌ను నియమించినట్టు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 9 నుంచి కుమార్ నియామకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆగస్ట్ 31న వైదొలగిన సంజీవ్ తనేజా స్ధానంలో ఆశిష్ కుమార్‌ను నూతన సీఎఫ్ఓగా నియమించినట్టు స్పైస్‌జెట్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
స్పైస్‌జెట్‌కు ముందు కుమార్ 2019 జనవరి నుంచి ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకుముందు 2014 నుంచి 2018 వరకూ ఆయన ఇంటర్‌గ్లోబ్ హోటల్స్ సీఎఫ్ఓగా వ్యవహరించారు. కాగా లిక్విడిటీ ఇబ్బందులతో స్పైస్‌జెట్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ 784 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
మార్చి క్వార్టర్లోనూ కంపెనీ రూ 485 కోట్ల నష్టాన్ని చవిచూసింది. స్పైస్‌జెట్‌లో పునర్వ్యవస్ధీకరణ చేపట్టి తిరిగి సరైన దశలోకి చేర్చడం అవసరమని, ఈ దిశగా ఆశిష్ కుమార్ అనుభవం, నైపుణ్యాలు తమకు ఉపకరిస్తాయని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు.