హైదరాబాద్, మే 16: దేశంలో తొలి సర్టిఫైడ్ ఆర్గానిక్ పాల ఉత్పత్తుల కంపెనీ అక్షయకల్ప..రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. శంషాబాద్‌కు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ క్లస్టర్ కోసం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు నిధులు ఖర్చుచేయనున్నట్టు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ శశి కుమార్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు తమిళనాడు, కర్ణాటకలలో ఆర్గానిక్ క్లస్టర్లు ఉండగా..
తెలంగాణలో ఏర్పాటు చేసేది మూడోది కావడం విశేషం. హైదరాబాద్‌లో మార్కెటింగ్ విభాగంలో 80 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..మరో వంద మంది రైతులు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ నెలకు రూ.20 కోట్ల విక్రయాలు జరుపుతున్నది. వీటిలో ఆన్లైన్ ద్వారా 90 శాతం ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థ..ఆఫ్‌లైన్ మార్కెట్ కేవలం 10 శాతం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 2022-23లో రూ.205 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..ఈ ఏడాది రూ.300 కోట్లు ఆదాయం ఆశిస్తున్నట్టు చెప్పారు.