న్యూఢిల్లీ, జూన్ 8: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నెలలో నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘హోండా సమ్మర్ బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద రూ.88 వేల వరకు రాయితీ ఇస్తున్నది. ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లో ఒక జంట ప్యారిస్ లేదా రూ.75 వేల నగదును గెలుచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది.
ఈ నెల చివరి వరకు హోండా ఎలివేట్, హోండా సిటీ, సిటీ-ఈ: హెచ్ఈవీ, హోండా అమేజ్‌లను కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. వీటిలో హోండా అమేజ్‌పై రూ.76 వేల ప్రయోజనాలు అందిస్తున్న సంస్థ.. సిటీపై రూ.88 వేలు, సిటీ ఈ:హెచ్ఈవీపై రూ.65 వేల వరకు, ఎలివేట్‌పై రూ.55 వేలు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్లా మాట్లాడుతూ..కంపెనీ కార్లను కొనుగోలు చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ బొనాంజా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.