ఉబెర్‌కు షాక్.. 4.5 కోట్ల షేర్లు విక్రయించిన సాఫ్ట్ బ్యాంక్
ఉబెర్‌కు షాక్.. 4.5 కోట్ల షేర్లు విక్రయించిన సాఫ్ట్ బ్యాంక్| క్యాబ్స్ సర్వీస్ అగ్రిగేటర్ ఉబెర్ టెక్నాలజీస్‌లో జపాన్ కేంద్రంగా పని చేస్తున్న....

న్యూఢిల్లీ: క్యాబ్స్ సర్వీస్ అగ్రిగేటర్ ఉబెర్ టెక్నాలజీస్‌లో జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్ బ్యాంక్ బుధవారం సుమారు 45 మిలియన్ల వాటాలను విక్రయించిందని సమాచారం. ఉబేర్ షేర్లు 4.6 శాతం నష్టపోవడంతో 44 డాలర్ల వద్దకు చేరుకున్నది.
దీంతో సాఫ్ట్ బ్యాంక్ తన వాటాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే, ఎవరు వాటాలను విక్రయించినా 30 రోజుల లాకప్ పీరియడ్ ఉంటుందని ఉబేర్ సన్నిహిత వర్గాల కథనం.

దీదీ గ్లోబల్, ఆలీబాబా షేర్లు సరిగ్గా లేకపోవడంతో పాక్షికంగా తన వాటాలను ఉపసంహరించుకుని, లాభాలు గడించడానికి ఇదే సరైన టైం అని సాఫ్ట్ బ్యాంక్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో దీదీ గ్లోబల్ షేర్ 37 శాతం, ఆలీబాబా షేర్ 14 శాతం విలువ కోల్పోయింది.
తాజా నిర్ణయంతో ఉబేర్‌లో సాఫ్ట్ బ్యాంక్ షేర్ 100 మిలియన్ల లోపే నని దాని సన్నిహిత వర్గాల కథనం. ఉబేర్‌లో వాటాలను ఉపసంహరించుకున్న వార్తలతో సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ షేర్ 4.1 శాతం పుంజుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

