హైదరాబాద్ : స్కోడా ఇండియా మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. నూతన కుషక్ ఎస్యూవీ మాడల్‌ను తీసుకొచ్చింది. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ కారు గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను ఆధునీకరించినట్టు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వాతావరణానికి తగ్గట్టుగా ఏసీ కంట్రోల్, 17.7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేయడంలో భాగంగా 40కి పైగా భద్రత ఫీచర్లు, 1.5 టీఎస్ఐ ప్రిస్టేజ్ ఇంజిన్‌తో రూపొందించినట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశిష్ గుప్తా తెలిపారు. లీటర్ పెట్రోల్‌కు 19.66 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.