బెంగళూరు, మార్చి 24: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్కే మజుందార్ నియమితులయ్యారు. 56 ఏండ్ల వయస్సు కలిగిన మజుందార్‌కు బ్యాంకింగ్ రంగంలో 25 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఈ నియామకం వెంటనే అమలవుతుందని బ్యాంక్ పేర్కొంది. జనవరి 2000 నుంచి పలు హోదాల్లో పనిచేసిన ఆయన.. ప్రాజెక్ట్ ఫైనాన్స్, కార్పొరేట్ క్రెడిట్, అంతర్జాతీయ వ్యాపారాన్ని కూడా చూశారు.