TCS M-Cap | గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.1,68,260.37 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా నష్టపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 721.06 పాయింట్లు (1.32శాతం) నష్టాలతో ముగిసింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.99,270.07 కోట్లు కోల్పోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,95,355.32 కోట్లు కోల్పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను తాకకపోవడంతో టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం రూ.35,133.64 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయి రూ.6,01,900.14 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.18,172.43 కోట్లు పతనమై.. దాని ఎం-క్యాప్ రూ.7,57,659.72 కోట్లతో సరిపెట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,433.76 కోట్లు నష్టపోయి రూ.4,27,488.90 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.4091.62 కోట్ల పతనంతో రూ.4,02,121.99 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,158.85 కోట్లు నష్టపోయి రూ.5,22,498.11 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.17,128.52 కోట్లు లాభపడి రూ.6,03,551.26 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,801.72 కోట్లు లాభపడి రూ.16,24,681.08 కోట్ల వద్ద స్థిరపడింది.
ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,318.81 కోట్లు లాభపడి రూ.3,62,327.81 కోట్లకు చేరుకున్నది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) రూ.316.25 కోట్ల లబ్ధితో రూ.4,48,157.71 కోట్ల వద్ద ముగిసింది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్‌లో లీడ్‌లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.