తొలి పెట్టుబడికి ఎస్ఐపీ భేష్

మదుపు మొదలు పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం. వీటిలో ఏక మొత్తంగాగానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా చిన్న మొత్తాలతో ప్రతినెలగానీ మదుపు చేయవచ్చు. అయితే మొదటి మదుపు చేస్తున్న వారికి ఎస్ఐపీ మార్గం అత్యుత్తమం. వీటిలో తక్కువ రిస్క్‌తో అధిక రాబడిని పొందడానికి అవకాశం ఉన్నది. వారం, నెల, 3 నెలలు, 6 నెలలకోసారి చొప్పున కనీస మొత్తం రూ.500 నుంచి ఎంతైనా మదుపు చేయవచ్చు. మీ ఆదాయం, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ మొత్తాలను మీరే నిర్ణయించుకోవచ్చు. మొదటిసారిగా పెద్ద మొత్తాన్ని ఒకేసారి మదుపు చేయాలంటే ఎవరికైనా కంగారే. కానీ చిన్న మొత్తాలను ఎస్ఐపీ పద్ధతిలో మదుపు చేయాలంటే ప్రణాళిక ఉంటే చాలు. అందుకు చేయాల్సిందిల్లా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడమే. అందుకు పాటించాల్సిన పద్ధతులేమిటో చూద్దాం.
స్కీముల ఎంపిక
మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ స్కీములు అనేకం అందుబాటులో ఉన్నాయి. అందులో మన లక్ష్యాలను చేరుకోగల స్కీములను ఎంపిక చేయడం ముఖ్యం. రిస్క్ భరించగల స్థాయి, రాబడి అంచనాలకు తగ్గట్టుగా స్కీముల ఎంపిక జరగాలి. కాస్త ఎక్కువ రిస్క్ తీసుకోగలిగి, అధిక రాబడి ఆశిస్తున్నట్టయితే ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయవచ్చు. రిస్క్ వద్దనుకుని మోస్తరు రాబడులను ఆశిస్తే డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఓ మోస్తరు రిస్క్ తీసుకోగలినవారు సగటుకన్నా అధిక రాబడులను ఆశిస్తున్నట్టయితే హైబ్రిడ్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఫండ్ స్కీములతోపాటు మ్యూచువల్ సంస్థ కూడా ముఖ్యమే. వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అనేక రకాల మదుపు సాధనాలు ఆఫర్ చేస్తుంటాయి. అన్ని సంస్థలు ఒకే రకమైన రాబడులను అందించలేవు. అలాగే ఫండ్ మేనేజర్ కూడా ముఖ్యమే. మ్యూచువల్ సంస్థ, ఫండ్ మేనేజర్ల పూర్వపు పనితీరు మన అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే అందులో మదుపు చేయండి. ఎలాంటి మదుపు నిర్ణయాలకైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అలాగే మన మదుపుపై రాబడి రావాలంటే ఓపిక కూడా అంతే అవసరం. స్వల్పకాల ఒడిదుడుకులను చూసి దీర్ఘకాల నిర్ణయాల నుంచి తప్పుకోవడం పెద్ద తప్పిదమే అవుతుంది.
ఆర్థిక లక్ష్యాలు
చేసే మదుపు ఎంతకాలానికి అనేది ముఖ్యం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను మొదట నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు ఐదేండ్ల తర్వాత కారు, ఇల్లు, పిల్లల ఉన్నత చదువు ఇలాంటి లక్ష్యాలను చేరుకోవాలంటే కనీసం రూ.15 లక్షలు అవసరం. అందుకు తగ్గట్టుగా వచ్చే ఐదేండ్లలో నెలవారిగా ఎంత మదుపు చేయాలో గుర్తించండి. అందుకు తగ్గట్టుగా రాబడులను ఇచ్చిన మ్యూచువల్ స్కీములను గుర్తించండి. స్వల్ప కాలంలోనూ, దీర్ఘకాలంలోనూ అధిక రాబడిని స్థిరంగా ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీములను గుర్తించి వాటిలో నెలసరి మదుపు ఎస్ఐపీ పద్ధతిలో చేయండి.
అధిక రాబడి
చేస్తున్న మదుపు, వచ్చే రాబడి మన లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడేవిగా ఉండాలి. అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడిని ఇవ్వగలగాలి. మొత్తం మదుపు కాలానికి మిగతా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకన్నా అధికంగా రాబడి రావాలి. ముఖ్యంగా మనం మదుపు చేస్తున్న పథకం గత కొన్నేండ్లుగా స్థిరంగా రాబడులను ఇస్తూ ఉండాలి. సాధారణంగా రాబడులు ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధికన్నా అధికంగా ఉండాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- budget
- Business
- Business news
- SIP
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

