Silver Price | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: వెండి ధరలు గురువారం భారీ ఎత్తున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే కిలో రూ.2,000 ఎగబాకి రూ.87,000 పలికింది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ ధరలు ఇదే స్థాయిలో కదలాడుతున్నాయి. మరోవైపు బంగారం ధర తగ్గింది.
24 క్యారెట్ తులం రూ.250 దిగి రూ.74,350గా ఉన్నది. 22 క్యారెట్ రూ.74,000గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ రూ.73,150గా ఉంటే, 22 క్యారెట్ 10 గ్రాములు రూ.67,050గా ఉన్నది. బుధవారంతో చూస్తే రూ.100 మేర ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 2,547.70 డాలర్లు, సిల్వర్ 29.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.